20, డిసెంబర్ 2020, ఆదివారం

📚✍రేపు అమ్మఒడి లబ్ధిదారుల జాబితా✍📚



🌻ఈనాడు, అమరావతి: అమ్మఒడి లబ్ధిదారుల జాబితాను సోమవారం పాఠశాలలు, గ్రామ/వార్డు సచివాలయాలకు అందించనున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు శనివారంతో గడువు ముగియడంతో ఆన్‌లైన్‌లో అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ పరిశీలన అనంతరం జాబితాలను విడుదల చేయనున్నారు. అర్హులైన వారు అనర్హుల జాబితాల్లో ఉంటే సంబంధిత పాఠశాలకు వెళ్లి, వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు నమోదు చేసే వివరాలను సంయుక్త కలెక్టర్లు పరిశీలించి, ఆమోదిస్తే అర్హుల జాబితాలోకి వస్తారు.

కామెంట్‌లు లేవు: