20, డిసెంబర్ 2020, ఆదివారం

🔳డిగ్రీలో ఒకేషనల్‌ కోర్సులు..దరఖాస్తులు ఆహ్వానించిన ఎపిఎస్‌సిహెచ్‌ఇ..





అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఒకేషనల్‌ డిగ్రీ కోర్సులు ప్రారంభించేందుకు కళాశాలలు దరఖాస్తు చేసుకోవాలని ఎపి ఉన్నత విద్యామండలి (ఎపిఎస్‌సిహెచ్‌ఇ) కార్యదర్శి ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. ఈ కోర్సులు ప్రారంభించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ కొన్ని కళాశాలలకు అనుమతిచ్చిందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎపి ఉన్నత విద్యామండలి (ఎపిఎస్‌సిహెచ్‌ఇ) దానికి అనుగుణంగా ఆయా కళాశాలలు అనుబంధ గుర్తింపు కోసం సంబంధిత యూనివర్సిటీలను, ఫీజు నిర్ధారణ కోసం ఎపిఎస్‌సిహెచ్‌ఇను సంప్రదించాలని ఆదేశించారు. మిగిలిన వివరాలు కమిషన్‌ వెబ్‌సైట్‌ షషష.aజూష్ట్రవతీఎష.aజూ.స్త్రశీఙ.ఱఅలో పొందుపరిచినట్లు తెలిపారు.

కామెంట్‌లు లేవు: