20, డిసెంబర్ 2020, ఆదివారం

📚✍సంక్షేమ గురుకులాల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు✍📚



🌻సాక్షి, అమరావతి: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహించేందుకు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి గురుకుల సొసైటీ దరఖాస్తులు కోరుతున్నది. తాడేపల్లిలో ఉన్న గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు గురుకుల కార్యదర్శి కల్నల్ వి.రాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 16 పోస్టులు ఖాళీ ఉన్నాయని, 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుందన్నారు. ఎస్ఎస్ సీ, ఇంటర్, బీఎస్సీ (నర్సింగ్) సర్టిఫికెట్లతో పాటు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, బయోడేటాను జతచేసి apswreishealth@gmail.comకు ఈనెల 28 సాయంత్రం 5లోపు పంపించాలని కోరారు.

కామెంట్‌లు లేవు: