18, నవంబర్ 2023, శనివారం

డిసెంబరు 17న ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ‘గెస్ట్‌ 2024’

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-


డిసెంబరు 17న ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ‘గెస్ట్‌ 2024’

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ విద్యాసంస్థలు గత తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్న గరల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (గెస్ట్‌–2024)ను ఈ ఏడాది డిసెంబరు 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ద్వారా ఉపకార వేతనం అందజేస్తారు. అలాగే మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు రూ.5 వేలు చొప్పున, తర్వాత 15 ర్యాంకుల బాలికలకు నెలకు రూ.3 వేలు చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసే వరకు అందిస్తారు. 10వ తరగతి చదువుకున్న బాలికలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆసక్తి ఉన్న బాలికలు ఈనెల 18 నుంచి డిసెంబరు 15 మధ్య ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాల వెబ్‌సైట్‌ ntrcollegeforwomen.education లో పేర్లు నమోదు చేసుకోవాలని, లేదా 7660002627/28 మొబైల్‌ నంబర్లతో సంప్రదించాలని భువనేశ్వరి సూచించారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్‌ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు.


ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రతిభ గల విద్యార్థినులకు ఉపకారవేతనం అందించడానికి ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ (జీఈఎస్‌టీ-2024)ను డిసెంబర్‌ 17న నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ నెల 18 నుంచి డిసెంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి పది ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.5 వేలు, తర్వాతి 15 ర్యాంకులు పొందినవారికి నెలకు రూ.3 వేల చొప్పున ఎన్టీఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసేవరకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల వారు www.ntrcollegeforwomen.education వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: