అమరావతి, నవంబరు
17 (ఆంధ్రజ్యోతి): ఫార్మసీ కోర్సుల కోసం ఇంటర్మీడియట్ బైపీసీ విభాగం
నుంచి నిర్దేశించిన సీట్ల కేటాయింపును శుక్రవారం పూర్తి చేసినట్టు ఏపీఈఏపీ
సెట్–2023 కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి
తెలిపారు. బి.పార్మసీ, ఫార్మా–డి, ఫార్మస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సులకు
సంబంధించి 192 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 10,423 సీట్లు అందుబాటులో
ఉండగా, 141 సీట్లు మినహా 10,282 సీట్లు భర్తీ చేశామని శుక్రవారం ఒక
ప్రకటనలో వెల్లడించారు. బైపీసీ స్ట్రీమ్‌కు ఫార్మా కోర్సుల కోసం 15,456
మంది నమోదు చేసుకోగా, వీరిలో 15,395 మంది అర్హత సాధించారని, వీరిలో 14,832
మందికి తుది ఎంపికలో సీట్లు కేటాయించినట్టు వివరించారు. రాష్ట్ర
క్రీడాభివృద్ధి సంస్థ నుంచి తుది మెరిట్ జాబితా రావాల్సి ఉన్నందు వల్ల 47
క్రీడల కోటా సీట్లను భర్తీ చేయలేదన్నారు. తుది గడువులోగా వీటిలో కూడా
విద్యార్థులను కేటాయిస్తామని తెలిపారు.
- | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి