8, నవంబర్ 2023, బుధవారం

నోటిఫికేషన్స్‌ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గ్రామాల్లో 53 ఆశా వర్కర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. నంద్యాల జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 26 అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. బెంగళూరులోని రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ).. 12 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇస్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (మేనేజ్‌).. 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

నోటిఫి కేషన్స్‌

పాడేరులోని జిల్లా ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గ్రామాల్లో 53 ఆశా వర్కర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ..

పోస్టులు: 53

పాడేరులోని జిల్లా ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గ్రామాల్లో 53 ఆశా వర్కర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పదో తరగతితో పాటు ఖాళీ ఉన్న గ్రామ పరిధిలో నివసిస్తున్న మహిళలు అర్హులు. వయసు: 25-45 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: ఆశా వర్కర్లను జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి సంబంధిత పీహెచ్‌సీల్లో అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.

ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా వెల్లడి: 15-11-2023.

అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ తేదీలు: 16, 17-11-2023.

తుది మెరిట్‌ జాబితా, ఎంపిక జాబితా వెల్లడి: 19-11-2023.

నియామక ఉత్తర్వుల జారీ: 20-11-2023.

వెబ్‌సైట్‌: https://allurisitharamaraju.ap.gov.in/


నంద్యాల జిల్లాలో అంగన్‌వాడీ ఖాళీలు

పోస్టులు: 26

నంద్యాల జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 26 అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

మినీ అంగన్‌వాడీ కార్యకర్త: 01 

అంగన్‌వాడీ ఆయా: 25  

వయసు: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హత: 10వ తరగతి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను నంద్యాల జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.

వెబ్‌సైట్‌: https://nandyal.ap.gov.in/


రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అసిస్టెంట్‌లు

పోస్టులు:12

బెంగళూరులోని రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ).. 12 రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌- 01  

అసిస్టెంట్‌ క్యాంటిన్‌ మేనేజర్‌- 01

అసిస్టెంట్‌- 09 బీ అసిస్టెంట్‌ 1- 01

అర్హత: ఇంటర్‌, సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04-12-2023.

వెబ్‌సైట్‌: www.rri.res.in/careers/other-openings 


మల్టీమీడియా ఎడిటర్‌, కెమెరామెన్‌లు

పోస్టులు: 6

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇస్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌ (మేనేజ్‌).. 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మల్టీమీడియా ఎడిటర్‌: 02 బీ కెమెరామెన్‌: 02

టెక్నికల్‌ అసిస్టెంట్‌: 02 అర్హత: ఇంటర్‌, సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: 14, 15, 16-11-2023.

వేదిక: మేనేజ్‌, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌.

వెబ్‌సైట్‌: https://www.manage.gov.in/

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: