
గుంటూరులోని ఆచార్య ఎన్.జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ(ఏఎన్‌జీఆర్‌ఏయూ)–ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా కింద డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బీఎస్సీ (ఆనర్స్), బీటెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రవాస భారతీయుల పిల్లలు, వారు స్పాన్సర్ చేసిన బంధువుల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు–సీట్లు: ప్రతి కోర్సులో ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా కింద 15 శాతం సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయించారు. బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో అగ్రికల్చర్ 122, కమ్యూనిటీ సైన్స్ 14 సీట్లు ఉన్నాయి. బీటెక్ కోర్సులో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ విభాగాలకు ఒక్కోదానిలో 18 సీట్లు ఉన్నాయి.
● దరఖాస్తు ఫీజు: రూ.2,000
● దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: నవంబరు 18
● వెబ్‌సైట్: angrau.ac.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి