కాస్త పెద్ద పోస్ట్ , ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ ఓపికతో చదవండి.
మ్యాటర్ లోకి వెళ్ళే ముందు రెండు మూడు సంఘటనలు చెప్తాను.
1. రూరల్ నుండి కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఒక 23 యేండ్ల అమ్మాయి హాస్టల్ లో ఉండి చదువుతుంది. ఒక నెలపాటు ఉన్న తరువాత వేకెట్ చేసి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బయట ప్రైవేట్ గా వేరే రూం తీసుకొని ఇద్దరూ కలిసి ఉంటున్నారు. పేరెంట్స్ పంపే హాస్టల్ ఫీజుతో రూం రెంట్ కడుతుంది , ఆ అబ్బాయి పేరెంట్స్ పంపే ఫీజుతో భోజన ఖర్చులు సర్దుకుంటున్నారు.
ఎప్పుడైనా పేరెంట్స్ వస్తే ఆరోజు వాళ్ళు వచ్చే టైంలో హాస్టల్ కి వెళ్లి తన పాత రూమ్మేట్ తో కలిసి ఉండి పేరెంట్స్ ను కలిసి వాళ్ళు వెళ్ళిపోయాక తిరిగి తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది.
2. మా అపార్ట్మెంట్ లో మా ఎదురు ఫ్లాట్ లో ఇద్దరు వర్కింగ్ జంట ఉంటారు. వాళ్ళు అందులోకి వచ్చి మూడేళ్లు అయింది.ఇంకా పిల్లలు కాలేదు , ఇప్పుడే వద్దనుకున్నారేమో.
గతవారంలో అతని పేరెంట్స్ వచ్చి మూడు రోజులు ఉండిపోయారు. ఆ మూడు రోజులు కోడలు ఫ్లాట్ లో లేదు , వాళ్ళు వెళ్ళిపోగానే వచ్చింది 🙄
అప్పుడు వాచ్మెన్ చెప్పాడు : సార్ వాళ్లకు పెళ్లి కాలేదు , మూడేళ్లు గా కలిసే ఉంటున్నారు.అతనికి పెళ్లి సంబందం చూడటానికి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు , అందుకే ఆవిడ ఇంట్లో లేదు అని ... నేను షాక్ 😥
3. వరంగల్ లో బాగా తెలిసిన పేరెంట్స్ తో మాట్లాడుతుంటే వాళ్ళు తమ కూతురు కోసం చెప్తున్నారు , తను హైదరాబాద్ లో ప్రముఖ నేత్ర వైద్యశాల లో జాబ్ చేస్తుంది అని.అందుకు నేను అడిగిన ప్రశ్నలు :
హాస్పిటల్ పేరేంటి ?
ఎక్కడ బ్రాంచ్ ?
తను ఎక్కడ నివాసం ఉంటుంది ?
తనతో పనిచేసే కొలీగ్స్ ఎవరైనా తెలుసా ?
సాలరీ ఎంత ?
అది అకౌంట్ కి వస్తుందా , వస్తే ఎప్పుడైనా అకౌంట్ చూసారా ?
తనను పంపించడానికి లేక తీసుకురావడానికి మీరు ఎప్పుడైనా తనతోపాటు అక్కడికి వెళ్ళారా ?
ఇందులో ఏ ఒక్కదానికి వారి దగ్గర సమాధానం లేదు.
తరువాత ఒక్కపూట ఎంక్వైరీ లో నాకు తెలిసినది , ఆ అమ్మాయి ఎక్కడా జాబ్ చేయట్లేదు , తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ప్రైవేట్ గా రూం లో ఉంటుంది , వాడేమో ఒక కంపనీ లో ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్నాడు అని.
ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి , ఇవన్నీ కూడా పట్టణాలలో పెరిగిన సహజీవనం అనే విష సస్కృతిని చూపిస్తున్నాయి.అది ఇప్పుడు ఎంతగా పెరిగింది అంటే రూరల్ లో ఉండేవాళ్లకు వింతగా ఉన్నా సిటీస్ లో ఉండేవాళ్లు నిత్యం చూసే దృశ్యాలే. అది దాదాపుగా ఎవరి దృష్టికి తప్పుగా అనిపించట్లేదు.
తామేం చేసినా తమ పేరెంట్స్ కు తెలియదు అనే మొండి దైర్యం , ఫ్రెండ్స్ + కొలీగ్స్ సపోర్ట్ చేస్తారు అనే నమ్మకం కూడా వారికి కలిసొచ్చే అంశం.
ఇక పేరెంట్స్ కు వారి పనులు , బాధ్యతలు , దూరభారం అనేక కారణాల చేత పిల్లలను నమ్మడం , వారికి స్వేచ్ఛను ఇచ్చి పంపించడం , అవసరాలకు డబ్బు పంపడమే తప్ప ఇంకేమీ ఎరుగని పరిస్తితిలో ఉన్నారు.
ఇందులో తప్పెవరిది అని కాకుండా పేరెంట్స్ మీద , పిల్లల మీద నిందలు వేయకుండా , అమ్మాయిలదా , అబ్బాయిలదా అని కాకుండా కాస్త సంయమనంతో ఆలోచించాల్సిన సున్నితమైన విషయం ఇది.
అబ్బాయిలు ఎన్ని తప్పులు చేసినా , ఎందరితో తిరిగినా వాడు మగాడు అనే అహంకారం వారికి , సమాజానికి కూడా ఉంది. అదే అమ్మాయి చేస్తే మాత్రం ఈ సమాజం సమానంగా చూడదు , అంగీకరించదు. ఆకు - ముళ్ళు సామెత ఎంత పాతది అయినా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సామెతనే అది.తన తప్పు ప్రభావం తన జీవితాంతం కాకుండా తన పిల్లలను కూడా నిరంతరం వెంటాడే ఒక పీడకల.
అందుకే ఆడపిల్లల పేరెంట్స్ కనీసం నెలకొకసారి అయినా వారు చదువుతున్న కాలేజీ , యునివర్సిటీ , హాస్టల్ , వర్క్ కి వెళ్లి వాళ్ళను కలిసి , కొంత సమయం గడిపి వస్తుంటే బాగుంటుంది. హాస్టల్ అయితే వాళ్ళ వార్డెన్ కు కలిసి బాగోగులు వాకబు చేయడం , కోచింగ్ + స్టడీ అయితే అక్కడ వారి ప్రోగ్రెస్ గురించి మాట్లాడటం లాంటివి చేయడం చాలా అవసరం మరియు క్షేమం. వీలైతే వారికి ముందు చెప్పకుండా వెళ్లి సడెన్ సర్ప్రైజ్ చేయడం ఇంకా మంచిది (అన్ని రకాలుగా) ....
ఇది ఆడపిల్లలను అనుమానించడం కాదు ... ఎవడైనా మోసగాడికి చిక్కుతుందేమో అనే అనుమానం , ఎవరి చేతుల్లో అయినా మోసపోయి సర్వస్వాన్ని పోగొట్టుకుంతుందేమో అనే అనుమానం , భవిష్యత్తును కోల్పోయి మీ కలలను కల్లలు చేస్తుందేమో అని అనుమానం ...
చెప్పాలంటే చాలా ఉంది కానీ దీనికి రిలేటెడ్ విషయాలు అందరికీ దాదాపుగా తెలిసే ఉంటుంది కదా .... ఎవర్నీ కించపరచాలని కాదు , ఎవర్నీ వేలెత్తి చూపాలని కాదు , స్త్రీ ద్వేషిని కాను - ఆడ పిల్లలకు తండ్రిగా బాధ్యత తోనే చెప్తున్నాను. మన పిల్లల భవిష్యత్తు అంధకారం కాకూడదు అని ఆలోచించి చెప్తున్నా , ఈ విషయాలను మంచి మనసుతో స్వీకరిస్తారు అని నమ్ముతూ .....
మీ మిత్రుడు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి