అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఒకేషనల్ డిగ్రీ కోర్సులు ప్రారంభించేందుకు కళాశాలలు దరఖాస్తు చేసుకోవాలని ఎపి ఉన్నత విద్యామండలి (ఎపిఎస్‌సిహెచ్‌ఇ) కార్యదర్శి ఎన్.రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. ఈ కోర్సులు ప్రారంభించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొన్ని కళాశాలలకు అనుమతిచ్చిందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎపి ఉన్నత విద్యామండలి (ఎపిఎస్‌సిహెచ్‌ఇ) దానికి అనుగుణంగా ఆయా కళాశాలలు అనుబంధ గుర్తింపు కోసం సంబంధిత యూనివర్సిటీలను, ఫీజు నిర్ధారణ కోసం ఎపిఎస్‌సిహెచ్‌ఇను సంప్రదించాలని ఆదేశించారు. మిగిలిన వివరాలు కమిషన్ వెబ్‌సైట్ షషష.aజూష్ట్రవతీఎష.aజూ.స్త్రశీఙ.ఱఅలో పొందుపరిచినట్లు తెలిపారు.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
20, డిసెంబర్ 2020, ఆదివారం
🔳డిగ్రీలో ఒకేషనల్ కోర్సులు..దరఖాస్తులు ఆహ్వానించిన ఎపిఎస్‌సిహెచ్‌ఇ..
🔳స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 17 స్టాఫ్ నర్సుల ఉద్యోగాల నియామకానికి సాంఘిక సంక్షేమశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఎపి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్టాఫ్ నర్సు ఉద్యోగాల నియామకానికి గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి బిఎస్‌సి నర్సింగ్ లేదా జిఎన్‌ఎం విద్యార్హత కలిగి రెండు నుంచి మూడేళ్లు అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 29 ఉదయం పది గంటలకు నిర్వహించే రాత, ముఖాముఖి పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు. ఆసక్తిగలవారు వారి విద్యార్హతల సర్టిఫికెట్లతో సూచించిన సమయానికి హాజరుకావాలని కోరారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం www.aphermc.ap.gov.in   సందర్శించాలని సూచించారు.
📚✍సంక్షేమ గురుకులాల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు✍📚
🌻సాక్షి, అమరావతి: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహించేందుకు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి గురుకుల సొసైటీ దరఖాస్తులు కోరుతున్నది. తాడేపల్లిలో ఉన్న గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు గురుకుల కార్యదర్శి కల్నల్ వి.రాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 16 పోస్టులు ఖాళీ ఉన్నాయని, 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుందన్నారు. ఎస్ఎస్ సీ, ఇంటర్, బీఎస్సీ (నర్సింగ్) సర్టిఫికెట్లతో పాటు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, బయోడేటాను జతచేసి apswreishealth@gmail.comకు ఈనెల 28 సాయంత్రం 5లోపు పంపించాలని కోరారు.
📚✍ప్రాంతీయ భాషల్లోనూ క్యాట్!✍📚
♦2021 లేదా 2022లో అమలుకు అవకాశం
🌻ఈనాడు,న్యూస్ : ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ల(ఐఐఎం)లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్టు(క్యాట్)ను ప్రాంతీయ భాషల్లోనూ జరిపే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత విద్యను ప్రాంతీయ భాషల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు మొదలుపెట్టింది. జాతీయ నూతన విద్యా విధానంలో చెప్పినట్లుగా ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక విద్యను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని, మొదట ఐఐటీల్లో ప్రారంభిస్తామని ఇటీవలే కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నీట్‌ను రెండేళ్ల నుంచి ఆంగ్లం, హిందీతో పాటు మరో 11 భాషల్లో నిర్వహిస్తున్నారు. ఇటీవలే కాలపట్టికను ప్రకటించిన జేఈఈ మెయిన్-2021ను కూడా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే క్యాట్‌ను కూడా అదే తరహాలో జరపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరీక్షను హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో పెట్టాలని ఐఐఎం రోహ్‌తక్ ఆచార్యుడు ఒకరు ఇటీవల క్యాట్-2020 కన్వీనర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయా ఐఐఎంలు సంప్రదింపులు జరుపుతున్నాయని కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించారు. ఈ లెక్కన క్యాట్-2021 లేదా 2022లో అది కార్యరూపం దాల్చవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
📚✍రేపు అమ్మఒడి లబ్ధిదారుల జాబితా✍📚
🌻ఈనాడు, అమరావతి: అమ్మఒడి లబ్ధిదారుల జాబితాను సోమవారం పాఠశాలలు, గ్రామ/వార్డు సచివాలయాలకు అందించనున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు శనివారంతో గడువు ముగియడంతో ఆన్‌లైన్‌లో అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఆన్‌లైన్ పరిశీలన అనంతరం జాబితాలను విడుదల చేయనున్నారు. అర్హులైన వారు అనర్హుల జాబితాల్లో ఉంటే సంబంధిత పాఠశాలకు వెళ్లి, వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు నమోదు చేసే వివరాలను సంయుక్త కలెక్టర్లు పరిశీలించి, ఆమోదిస్తే అర్హుల జాబితాలోకి వస్తారు.
డి ఇడి పరీక్షల హాల్ టికెట్ల విడుదల
ఈ నెల 23 నుంచి జరిగే డీఈడీ పరీ క్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల య్యాయని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి ఒక ప్రకట నలో తెలిపారు. 2018-20 బ్యాచ్ రెండో సంవ త్సరం విద్యార్థులు www.bse.ap.gov.in అనే వెబ్ లో హాల్ టికెట్లు పరిశీలించుకో: సై కోవాలన్నారు. హాల్ టికెట్ పై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ తో ధ్రువీ కరణ చేయించి, పరీక్ష కేంద్రానికి హాజరుకావాలన్నారు.
IB 2000 Jobs Recruitment Telugu 2020 || ఇంటలిజెన్స్ బ్యూరో(IB) నుండి 2000 పోస్టుల భర్తీ
2000 పోస్టుల భర్తీకీ ఇంటలిజెన్స్ బ్యూరో (IB) నుండి భారీ నోటిఫికేషన్ విడుదల :
మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ ఇంటలిజెన్స్ బ్యూరో (IB) లో, జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేది | డిసెంబర్ 19,2020 |
దరఖాస్తులకు చివరి తేది | జనవరి 9,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 2000 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
జనరల్ | 989 |
EWS | 113 |
ఓబీసీ | 417 |
ఎస్సీ | 360 |
ఎస్టీ | 121 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ కోర్సులను పూర్తిచేసి ఉండవలెను.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్యన ఉండాలి. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎగ్జామ్స్ ఫీజు 100 రూపాయలు మరియు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ ఫీజు 500 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ కు చెందిన అభ్యర్థులు ఎగ్జామ్స్ ఫీజు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 7th లెవెల్ ప్రాతిపదికన నెలకు 44,900 రూపాయలు నుండి 1,42,400 రూపాయలు వరకూ జీతం అందుకోనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనే అభ్యర్థులు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయనుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ :
గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం.
తెలంగాణ :
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...