11, డిసెంబర్ 2020, శుక్రవారం

*💁‍♀️మడికల్‌ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్‌..*

🍁ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే:

*🔰రష్ట్రంలోని ప్రైవేటు వైద్య, దంత కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ మేనేజ్‌మెంట్‌ కోటా ‘బి’, ‘సి’ కేటగిరీ సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఈ మేరకు గురువారం వివరాలు వెల్లడించింది. ఈ నెల 11న ఉదయం 8 గంటల నుంచి 16న ఉదయం 8 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ ఒరిజనల్‌ ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. ఎంబీబీఎస్‌ బి కేటగిరీ సీటుకు రూ.25 వేలు, ఎన్నారై(సి కేటగిరీ) సీటుకు రూ.65,500 చొప్పున విశ్వవిద్యాలయం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బీడీఎస్‌ కోర్సుకు బి కేటగిరీకి రూ.16 వేలు, సి కేటగిరీకి రూ.40 వేలు చెల్లించాలి. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.*


కామెంట్‌లు లేవు: