Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

11, డిసెంబర్ 2020, శుక్రవారం

DSC Notification 2020 in AP

బ్యాక్‌లాగ్‌ టీచర్‌‌ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
 
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయిన టీచర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలో డీఎస్సీ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. ప్రస్తుతం జిల్లాల వారీగా ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరిస్తోంది. త్వరలో ప్రకటన విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో సుమారు 403 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

డీఎస్సీ నోటిఫికేషన్
ఇంటర్ పాసైన వారికి 4726 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈనెల 15 ఆఖరు తేదీ
డిసెంబర్‌లోనే టెట్‌..?
ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌(టెట్‌) నిర్వ‌హ‌ణ‌కు కూడా అధికారులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. అనుమతి కోసం ప్రభుత్వానికి ఇప్పటికే వివరాలు పంపారు. ఈసారి పాఠ్య ప్ర‌ణాళిక‌లో మార్పులు చేయ‌నున్నారు. ఈ బాధ్య‌త‌ల‌ను రాష్ట్ర విద్య ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ మండ‌లి(ఎన్‌సీఈఆర్‌టీ)కి అప్పగించింది. ప్ర‌భుత్వం ఇంగ్లిష్‌ మీడియం ప్ర‌వేశ పెట్టాల‌ని భావిస్తున్నందున అభ్య‌ర్థులను ప‌రీక్షించేందుకు టెట్‌లో ఇంగ్లిష్‌ మీడియం నుంచి కొన్ని ప్ర‌శ్న‌లు ఇచ్చే అవ‌కాశం ఉంది. డిసెంబ‌రులోనే టెట్ నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. ఉపాధ్యాయ బ‌దిలీల ప్ర‌క్రియ ముగిసిన వెంట‌నే టెట్ నిర్వ‌హించే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం.

కామెంట్‌లు లేవు:

Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...