భారత
వైమానిక దళం పర్మనెంట్, షార్ట్‌సర్వీస్ కమిషన్లలో ఉన్నత స్థాయి ఉద్యోగాల
భర్తీకి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌క్యాట్)
ప్రకటన విడుదలైంది. ఏటా మే/జూన్, డిసెంబర్‌ల్లో ఏఎఫ్‌క్యాట్ ప్రకటన
వెలువడుతుంది.

ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ/ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ
మొత్తం ఖాళీల సంఖ్య: 235
విభాగాలు: ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్, నాన్ టెక్నికల్), ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ(ఫ్లయింగ్).
అర్హత: డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, బీకామ్, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత, ఎన్‌సీసీ సర్టిఫికెట్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయసు: ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు 20-24 ఏళ్ల మధ్య, మిగిలిన వాటికి 20-26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష, ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), పెలైట్ అప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 1, 2020.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 30, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://careerindianairforce.cdac.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి