ఐఐటీ ఢిల్లీ లో సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఒక ముఖ్య ప్రకటన విడుదల అయింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఢిల్లీ నుంచి ప్రాజెక్ట్ లకు సంబంధించిన సైంటిస్ట్ పోస్టుల భర్తీకి గాను ఒక నోటిఫికేషన్ వెలువడినది.అర్హతలు కలిగిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 2,2020 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 14,2020 |
విభాగాల వారీగా ఉద్యోగాలు :
ప్రాజెక్ట్ సైంటిస్ట్ | 2 |
సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ | 2 |
ప్రిన్సిపాల్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ | 1 |
సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ | 1 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ /ఎం. టెక్ /పీ.హెచ్ డీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40సంవత్సరాలు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఈ మెయిల్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ప్రాజెక్ట్ లకు కావాల్సిన సైంటిస్ట్ లను ఎంపిక చేయనున్నారు.
వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు విభాగాల వారీగా 30,000 రూపాయలు నుండి 80,000 రూపాయలు వరకూ జీతమును అందుకోనున్నారు.జీతం తో పాటు వీరికి HRA కూడా అందనుంది.
ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తు చేసుకోవాల్సిన ఈమెయిల్ అడ్రస్ :
ఈమెయిల్ అడ్రస్ :
smitak@dms.iitd.ac.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి