5, డిసెంబర్ 2020, శనివారం

AP High Court Recruitment 2020 Update | ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.


ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్ జడ్జి ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది. ఈ నియామకాలను  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూనియర్ డివిజన్ కేటగిరీ లో భర్తీ చేస్తున్నారు. AP High Court Recruitment 2020 Update

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో తాజాగా భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే  వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీ డిసెంబర్ 3,2020
దరఖాస్తు చివరి తేదీ జనవరి 2, 2021

ఉద్యోగాలు – వివరాలు :

తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ జడ్జి ల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఉద్యోగాలు :

సివిల్ జడ్జి లు68

( ఈ ఖాళీలలో 13 సివిల్ జడ్జి పోస్టుల ఖాళీలను బదిలీల ద్వారా భర్తీ చేయనున్నారు )

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు లా డిగ్రీ కోర్సు ను పూర్తి చేసి ఉండాలి మరియు మూడు (3) సంవత్సరాలు అడ్వాకేట్ గా ప్రాక్టీస్ పూర్తి చేసి ఉండవలెను.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 35  నుండి  48 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ మరియు ఓబీసీ కేటగిరీ కు చెందిన అభ్యర్థులు 800 రూపాయలు ఫీజును మరియు ఎస్సీ, ఎస్టీ కేటగిరి ల అభ్యర్థులు 400 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష , వ్రాత పరీక్ష మరియు వైవ ల నిర్వహణ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

వేతనం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నెలకు 27,700 రూపాయలు నుండి 44,770 రూపాయలును వేతనంగా పొందనున్నారు.

పరీక్ష కేంద్రాల ఎంపిక :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలుగా గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూల్ నగరాలను ఎంపిక చేసుకోవచ్చు.

Website

Notification

కామెంట్‌లు లేవు: