5, డిసెంబర్ 2020, శనివారం

AP Inter Exams 2020 Update Telugu || ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల పై తాజా వార్

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై తాజా వార్త :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలపై ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.

రాబోయే సంవత్సరం 2021 మార్చి నెలలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరుపనున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు తాత్కాలిక క్యాలెండరు షెడ్యూల్ ను  ఒక ప్రకటనను జారీ చేసింది.

ఏపీ ఇంటర్ బోర్డు  తాత్కాలికంగా విడుదల చేసిన క్యాలెండరు షెడ్యూల్ ప్రకారం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మార్చి మొదటి వారంలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించి, మార్చి చివరి వారంలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు – తాత్కాలిక క్యాలెండరు  పరీక్షల షెడ్యూల్ :

అర్ద సంవత్సరం పరీక్షలు (హాఫ్ ఇయర్లీ )జనవరి 2021
ప్రీ – ఫైనల్ పరీక్షలుఫిబ్రవరి 2021
ప్రాక్టికల్ పరీక్షలుమార్చి 2021
ఫైనల్ పరీక్షలు మార్చి 2021

కామెంట్‌లు లేవు: