9, డిసెంబర్ 2020, బుధవారం

🕉 *డిసెంబ‌రు 15 నుండి శ్రీ‌నివాసం, మాధ‌వంలో గ‌దుల కేటాయింపు*


🙏  *ఓం నమోవేంకటేశాయ*  🙏


        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:        
       శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం
తిరుప‌తిలోని శ్రీ‌నివాసం,
మాధ‌వం వ‌స‌తి స‌ముదాయాల్లో ని గ‌దుల‌ను డిసెంబరు 15వ తేదీ నుండి భ‌క్తుల‌కు కేటాయిస్తారు.

👉 ఈ స‌ముదాయాల్లోని గ‌దులు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉంటాయి.
 ఇందుకోసం డిసెంబ‌రు 10వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో గ‌దుల‌ను బుక్ చేసుకునే సౌక‌ర్యం క‌ల్పించారు.
www.tirupatibalaji.ap.gov.in ఈ వెబ్‌సైట్ ద్వారా భ‌క్తులు గ‌దుల‌ను బుక్ చేసుకోవ‌చ్చు.

🟢 కవిడ్‌-19 నేప‌థ్యంలో శ్రీ‌నివాసం, మాధ‌వం వ‌స‌తి స‌ముదాయాల‌ను కొంత కాలం పాటు క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించారు.
 కేసులు త‌గ్గ‌డంతో క్వారంటైన్ కేంద్రాల‌ను ఎత్తేశారు. గ‌దుల‌ను ద‌శ‌ల‌వారీగా పూర్తిగా శానిటైజ్ చేసి భ‌క్తుల‌కు కేటాయించేందుకు సిద్ధం చేశారు.
 *Dept.Of PRO TTD.*

కామెంట్‌లు లేవు: