9, డిసెంబర్ 2020, బుధవారం

AP Jobs Update 2020 Telugu || నిరుద్యోగులకు శుభవార్త, ఇకపై ప్రతీ నెల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

 

నిరుద్యోగులకు శుభవార్త, ఇక పై ప్రతినెల ప్రభుత్వ   ఉద్యోగాల భర్తీ :

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఏపీ గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఒక గుడ్ న్యూస్ ను అందించింది.ఏపీ లో ఇకపై ప్రతీ నెలలో  గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయం వాలంటీర్ పోస్టులను ఇకపై ప్రతీ నెల భర్తీ చేయనున్నారు.

దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైనది.

ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం  ప్రతీ నెల 1వ తేదీ  నుంచి 16 వ తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా  గ్రామ, వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న వాలంటీర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఈ వార్త ఏపీ లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఏపీ లో 7,120 గ్రామ మరియు వార్డు వాలంటీర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 5154 గ్రామ వాలంటీర్స్ మరియు 1966 వార్డు వాలంటీర్స్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఈ సందర్భంగా 35 సంవత్సరాల వయసు వారిని  వాలంటీర్స్ పోస్టులను తొలగిస్తున్నారనే  అనే ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దని ఏపీ సచివాలయ శాఖ తెలిపింది.

కామెంట్‌లు లేవు: