NIRDPR హైదరాబాద్ లో భారీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల :
భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వాశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) లో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక భారీ నోటిఫికేషన్ విడుదల అయినది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 8,2020 |
దరఖాస్తుకు ముగింపు తేదీ | డిసెంబర్ 29,2020 |
విభాగాల వారీగా ఖాళీలు :
స్టేట్ ప్రోగ్రామ్ కో – ఆర్డినేటర్ | 10 |
యంగ్ ఫెలో | 250 |
క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్ | 250 |
అర్హతలు :
స్టేట్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎకనామిక్స్ /రూరల్ డెవలప్మెంట్ /రూరల్ మానేజ్మెంట్ /పొలిటికల్ సైన్స్ /ఆంథ్రపాలజీ /సోషల్ వర్క్ /డెవలప్మెంట్ స్టడీస్ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ను పూర్తి చేయవలెను.
యంగ్ ఫెలో :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు సోషల్ సైన్సెస్ పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ /రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమో కోర్సులను పూర్తి చేయాలి.
క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ విద్య ను పూర్తి చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లీడర్ గా పని చేసి ఉండాలని , NIRDPR/NRLM/SRLM నుంచి సంబంధిత సర్టిఫికెట్ ప్రోగ్రాములను పూర్తి చేయవలెను.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాలను అనుసరించి 21 సంవత్సరాలనుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి నెలకు 12,500 రూపాయలు నుండి 85,000 రూపాయలు వరకూ జీతం లభిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి