9, డిసెంబర్ 2020, బుధవారం

T T D NEWS


🙏  *ఓం నమోవేంకటేశాయ*  🙏
🕉  *క‌పిల‌తీర్థంలో ఉమా స‌హిత శంక‌ర వ్ర‌తం*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:  కార్తీక మాస దీక్ష‌ల్లో భాగంగా మంగ‌ళ‌‌వారం తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌రాల‌య ప్రాంగ‌ణంలో ఉమా స‌హిత శంక‌ర వ్ర‌తం శాస్త్రోక్తంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

👉ఈ సంద‌ర్భంగా పండితులు శ్రీ ప‌వ‌న కుమార శ‌ర్మ వ్ర‌తం విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. లోక క‌ల్యాణాన్ని కాంక్షిస్తూ, భ‌క్తులంద‌రూ క్షేమంగా ఉండాల‌ని స్వామివారిని ప్రార్థిస్తూ టిటిడి హోమాలు, వ్ర‌తాలు నిర్వ‌హిస్తోంద‌న్నారు. ఉమా స‌హిత శంక‌ర వ్ర‌తం ఆచ‌రించ‌డం వ‌ల్ల వ్యాధులు ద‌రి చేర‌కుండా ప‌ర‌మేశ్వ‌రుడు ర‌క్షిస్తార‌ని చెప్పారు. కుటుంబంలోని పెద్ద‌లు, శిశువులు, తల్లిదండ్రులు, యువ‌కులు ఆరోగ్య‌క‌రంగా ఉంటార‌ని వివ‌రించారు.

ముందుగా పార్వతి పరమేశ్వరుల చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. సంక‌ల్పంతో పూజ‌ను ప్రారంభించి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.
 *Dept.Of PRO TTD.*

కామెంట్‌లు లేవు: