9, డిసెంబర్ 2020, బుధవారం

TTD News

🙏  *ఓం నమోవేంకటేశాయ*  🙏

🕉  *డిసెంబ‌రు 11న శ్రీ‌నివాస‌మంగాపురంలో కార్తీక వ‌న‌భోజ‌నం*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:
 టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో
 డిసెంబ‌రు 11న శుక్ర‌వారం కార్తీక వనభోజన కార్యక్రమం జరుగనుంది.
 కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

👉 ఈ ఉత్స‌వం కార‌ణంగా కల్యాణోత్సవం ఆర్జిత సేవ ర‌ద్ద‌యింది. పవిత్రమైన కార్తీక మాసంలో ద్వాద‌శి నాడు ఇక్క‌డ వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

👉 ఇందులో భాగంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పానికి వేంచేపు చేస్తారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు.

👉ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత అలంకారం, వ‌న‌భోజ‌నం, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వహిస్తారు.
 *Dept.Of PRO TTD.*

కామెంట్‌లు లేవు: